RRB: పారా-మెడికల్ పరీక్ష తేదీలు విడుదల! 10 d ago

పారా-మెడికల్ పరీక్ష (సీబీటీ) తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్ 04/2024 నోటిఫికేషన్‌ను గత ఏడాది జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.